మార్కెట్ మూసేస్తారా.. మరిన్ని వైరస్‌లు తెస్తారా!!

మరిన్ని వైరస్‌లు వచ్చి మానవాళిని మట్టు పెట్టకుండా ఉండాలంటే చైనా మార్కెట్‌ని మూసివేయడం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అమెరికాకు చెందిన ఇద్దరు రిపబ్లికన్ పార్థీ ముఖ్య ప్రతినిధులు. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కోరాలని అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాశారు. మాంసాహార మార్కెట్లను చైనా కట్టడి చేయలేకపోతోందని ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని భయంకరమైన వ్యాధులు రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు అవసరమన్నారు.
ఈ విక్రయశాలల్లో శుభ్రత పాటించకపోవడం అనేది కూడా మరో ముఖ్యమైన అంశంగా చెబుతున్నారు. కరోనా బారిన పడి వేల మంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో.. చైనా చర్యలను కఠినతరం చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. వూహాన్ నుంచే వచ్చిందని భావిస్తున్న కరోనా వైరస్ వలన ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,32,10,572మంద ఈ మహమ్మారి బారిన పడగా అందులో 1,58,691 మంది మృత్యువాత పడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com