అంతర్జాతీయం

లాక్డౌన్‌ని ధిక్కరించి వేల సంఖ్యలో అంత్యక్రియలకు హాజరు..

లాక్డౌన్‌ని ధిక్కరించి వేల సంఖ్యలో అంత్యక్రియలకు హాజరు..
X

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంటే అది దేశ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని. ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న వేళ ప్రభుత్వ ఉత్తర్వులను ఖాతరు చేయక ఓ ముస్లిం మతాధికారి అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో లాక్డౌన్ కొనసాగుతున్న వేళ ఈ అంత్యక్రియలు జరిగాయి. ఇప్పటికే అక్కడ కరోనా బారిన పడి 84 మంది మరణించారు. 2,144 పాజిటివ్ కేసులను గుర్తించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ ఖెలాఫత్ మజ్లిస్‌కు చెందిన నయెబ్-ఎ-అమీర్ (డిప్యూటీ) గా ఉనన మౌలానా జుబాయర్ అహ్మద్ అన్సారీ (55) శుక్రవారం రాత్రి సరైల్ జిల్లాలోని బెర్తాలా గ్రామంలో మరణించారు.

అతని అంత్యక్రియలు స్థానిక మదర్సాలో జరిగాయి. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ముస్లిం సోదరులు హాజరయ్యారు. వారి ప్రాణాలను ఫణంగా పెట్టడంతో పాటు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించారని ట్రిబ్యూన్ నివేదించింది. సామాజిక దూరాన్ని పాటించాలన్న కఠినమైన ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించారు. ఇంత పెద్ద సంఖ్యలో జనం హాజరు కావడాన్ని ఊహించలేని పోలీసులకు వారిని కట్టడి చేయడం కష్టమైపోయింది. ప్రభుత్వం సభలు, సమావేశాలను నిషేధించిన వేళ అంత్యక్రియలు ఏర్పాటు చేయడం అత్యంత దురదృష్టకరం అని జిల్లా కరోనా వైరస్ నియంత్రణ మరియు నివారణ కమిటీ సభ్యుడు అల్ మామూన్ సర్కార్ అన్నారు.

Next Story

RELATED STORIES