చైనాలో పర్యాటక ప్రదేశాలకు అనుమతి

చైనాలో పర్యాటక ప్రదేశాలకు అనుమతి

ప్రస్తుతం చైనాలో కరోనా వ్యాప్తి తగ్గడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొన్నటిదాకా లాక్ డౌన్ కారణంగా బంద్ అయిన పర్యాటక ప్రాంతాలను తిరిగి తెరిచింది. అయితే అన్ని ప్రాంతాలను మాత్రం కాదు.. వైరస్ ప్రభావం లేని చోట్ల ఈ సడలింపు ఇచ్చింది. వార్తా సంస్థ జిన్హువా ప్రకారం, చైనా గోడతో సహా 73 పర్యాటక ప్రదేశాలు ప్రారంభించబడ్డాయి. ఈ పర్యాటక ప్రదేశాలన్నీ మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం 30% పర్యాటకులు ఈ ప్రదేశాలన్నింటినీ సందర్శించడానికి అనుమతి ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా చైనాలో 82,747 మంది కరోనావైరస్ భారిన పడ్డారు.. ఇందులో 77,084 మంది కోలుకోగా 4,632 మంది మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story