20 April 2020 10:54 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / కెనడాలో కాల్పులు.. 16...

కెనడాలో కాల్పులు.. 16 మంది మృతి..

కెనడాలో కాల్పులు.. 16 మంది మృతి..
X

కెనడాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా పోలీస్ అధికారి సహా 16 మందిని హతమార్చాడో దుండగుడు. ఈ ఘటన నోవా స్కోటియాలో జరిగింది. పోలీసు అధికారిలాగా మారువేషంలో ఉన్న ఓ ముష్కరుడు 16 మందిని హతమార్చాడు.. ఇది దేశ చరిత్రలో ఘోరమైన దాడిగా ప్రభుత్వం భావిస్తుందని అధికారులు పేర్కొన్నారు. అయితే అనుమానిత షూటర్ కూడా చనిపోయాడని అధికారులు తెలిపారు. నోవా స్కోటియా లోని హాలిఫాక్స్ కు ఉత్తరాన 60 మైళ్ళు దూరంలో ఉన్న పోర్టాపిక్‌ పట్టణంలో మృతదేహాలను వెలికితీశారు.

కాల్పులు జరిపిన వ్యక్తి గాబ్రియేల్ వోర్ట్‌మన్ (51) గా పోలీసులు గుర్తించారు, అతను పోర్టాపిక్‌లో తాత్కాలికంగా నివసిస్తున్నట్లు భావిస్తున్నారు. అతను కాల్పుల సమయంలో పోలీసు యూనిఫాం ధరించి తన కారును పోలీస్ వాహనం లాగా తయారు చేసుకున్నాడని అధికారులు తెలిపారు. ఇక అతను ఎందుకు ఇలా చేశాడు అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Next Story