ఓ 5 నిమిషాలు ఇలా కూర్చోగలరా.. ఉపాసన ట్వీట్

సోఫాలు, డైనింగ్ టేబుళ్లు వచ్చాక కింద కూర్చోవడమే మర్చిపోయాం. అలాంటిది ఇలా కూర్చోవడమంటే ఎంత కష్టం. కానీ ఇలా రోజూ ఓ నిమిషాలు కూర్చుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నారు మెగా కోడలు ఉపాసన. సోషల్ మీడియాలో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరైన ఉపాసన ఈ సారి మరో ఛాలెంజ్ విసిరారు. ఈ భంగిమ శరీరానికి చక్కటి వ్యాయామమని చెబుతూ, ఇలా కూర్చోవడం వల్ల కాళ్ల ఎముకలు గట్టిపడతాయని, శరీరంలోని చిన్న పేగు, పెద్దపేగు కదలికలు సులువుగా మారతాయని అంటున్నారు.
ఇలా కూర్చున్నప్పుడు మోకాలు 90 డిగ్రీల వరకు వంగుతుంది. శరీరంలోని మృదులాస్థి కదలికలకు సైనోవియల్ ఫ్లూయిడ్ కీలకం. ఈ విధంగా కూర్చుంటే ఈ ఫ్లూయిడ్ విస్తరిస్తుందని అంటున్నారు. దాంతో త్వరగా మోకాళ్ల నొప్పుల బారిన పడకుండా ఉండొచ్చని అంటున్నారు. తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణమవుతుందని తెలిపారు. ఉపాసన చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. పోస్ట్ చేసిన 24 గంటల్లోనే 8వేల లైకులు, 900 రీట్వీట్లు వచ్చాయి. ఆమెను ప్రశంసిస్తూ పలువురు కామెంట్లు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com