బ్రేకింగ్.. తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు

బ్రేకింగ్.. తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఆదివారం కేబినెట్‌ భేటీ జరిగింది. అనంతరం తెలంగాణలో లాక్ డౌన్ కాలాన్ని పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. కేంద్ర సర్కార్ ప్రకటించినట్టు మే 3 వరకు యధావిధిగా కొనసాగుతుందని.. అయితే, తెలంగాణలో మే 7 వరకు కూడా లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ సృష్టం చేశారు.

అలాగే తెలంగాణలో మూడు నెలలపాటు ఇంటి అద్దెలు వసూలు చేయొద్దని కేసీఆర్ ఆదేశించారు. ఈ 3నెలల కిరాయి వడ్డీలేకుండా తర్వాత వాయిదాల వారీగా చెల్లించొచ్చని సీఎం పేర్కొన్నారు. కిరాయి కోసం ఓనర్లు ఇబ్బంది పెడితే డయల్‌ 100కు ఫిర్యాదు చేయండి అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

ఇక ప్రైవేట్‌ స్కూళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు పెంచకూడదని సూచించారు. నెలవారీగా మాత్రమే ట్యూషన్‌ ఫీజులు వసూలు చేయాలి. ట్యూషన్‌ ఫీజు కాకుండా ఎలాంటి ఫీజు వసూలు చేయడానికి వీల్లేదు. 2020-21 ఏడాదికి విద్యా సంస్థల్లో ఒక్క రూపాయి కూడా ఫీజులు పెంచకూడదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే విద్యాసంస్థల అనుమతులు రద్దు చేస్తాం అని తెలిపారు.

ఇక మే నెలలో కూడా ప్రతి తెల్ల రేషన్‌ కార్డుదారుడికి 12 కిలోల బియ్యం, కుటుంబానికి రూ.1500 చొప్పున నగదు సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story