కరోనా కట్టడికి 99 ఏళ్ల మాజీ ఎమ్మెల్యే సాయం..

కరోనా కట్టడికి 99 ఏళ్ల మాజీ ఎమ్మెల్యే సాయం..
X

కరోనాకు వ్యతిరేకంగా పోరాటంలో చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ సహాయం చేస్తున్నారు. ఈ జాబితాలో గుజరాత్ మాజీ ఎమ్మెల్యే రత్నా బాపా తున్మెరే (99) కూడా చేరిపోయారు. బాపా ఏప్రిల్ 17 న కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని 51 వేల రూపాయల తన పెన్షన్‌ను ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌లో జమ చేశారు. ఈ సహాయాన్ని కరోనా కట్టడికి చేస్తున్న ప్రయత్నాలకు వినియోగించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ను తాజా వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇక బాపా సహాయం గురించి ఢిల్లీలో చర్చ జరిగింది. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదికి ఈ విషయం తెలుసుకున్నారు. తన క్షేమం గురించి తెలుసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా బాపాకు కాల్ చేశారు. గొప్ప విషయం ఏమిటంటే, బాపా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు, లిఫ్ట్ పనిచేయలేదు.. దాంతో ఆయన నిచ్చెన ఎక్కి ఆఫీసులోకి వెళ్లారు.

Tags

Next Story