అలా ఎలా చెప్తాను.. నేనేమైనా సమంతనా!!

మెగా ఇంటి ఆడపడుచు నాగేంద్ర బాబు ముద్దుల తనయ నీహారిక బుల్లి తెర మీద పరిచయమై వెండి తెరనూ అలంకరించింది. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక పెదనాన్న సైరా నరసింహారెడ్డి చిత్రంలోనూ కనిపించింది. ఆ తరువాత మరే చిత్రంలోనూ కనిపించలేదు. అయితే వెబ్‌సిరీస్ చేస్తూ బిజీగా ఉన్న నీహారిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యాంకర్ రవితో కలిసి మాట్లాడింది. పెళ్లి తరువాత నటించే ఆలోచన ఏమైనా ఉందా అని అడిగితే.. నేనేమైనా సమంతనా పెళ్లి తరువాత నటిస్తానో లేదో చెప్పడానికి.. ఇకపై వచ్చిన ప్రతి మంచి ఆఫర్‌ని వదలిపెట్టకుండా నటిస్తానని అంటోంది. ఇక గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుందనుకున్న నీహారిక.. తన తరువాతి ప్రాజెక్ట్ రొమాంటిక్ చిత్రం అవుతుందని చెబుతోంది. ఆ చిత్రం గోవాలో షూటింగ్ జరుపుకోబోతోందని చెబుతోంది. గోవా బీచ్‌లో ఈ రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ జరగనున్నట్లు చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com