మధ్యప్రదేశ్ లో కొలువుదీరిన మంత్రివర్గం

మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గం మంగళవారం ఏర్పడింది. రాజ్ భవన్‌లో జరిగిన 13 నిమిషాల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 5 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ సీనియర్ ఎమ్మెల్యేలు నరోత్తం మిశ్రా, కమల్ పటేల్, మీనా సింగ్ మంత్రులు అయ్యారు. అలాగే జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన తులసి సిలావత్, గోవింద్ సింగ్ రాజ్‌పుత్ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారం చేసిన ఐదుగురు నాయకులు గతంలో శివరాజ్, కమల్ నాథ్ ప్రభుత్వాలలో మంత్రులుగా ఉన్నారు. కమల్ నాథ్ ప్రభుత్వంలో సిలావత్ ఆరోగ్య మంత్రిగా, గోవింద్ సింగ్ రాజ్‌పుత్ రెవెన్యూ, రవాణా మంత్రిగా ఉన్నారు. శివరాజ్ మునుపటి ప్రభుత్వంలో ఉన్న నరోత్తం మిశ్రా ప్రజా సంబంధాల మంత్రిగా , కమల్ పటేల్ వైద్య విద్య మంత్రిగా ఉన్నారు. మీనా సింగ్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com