ప్రభుత్వానికి సహకరిస్తాం.. ప్రార్థనలు ఇంట్లోనే చేసుకుంటాం

కరోనా వైరస్ నివారణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సహకారం అందిస్తామని ముస్లిం మతపెద్దలు తెలియజేశారు. సోమవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ముస్లిం మత పెద్దలు ఆయన్ను కలిసేందుకు వచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ఖుబుల్‌పాషా సత్తారి, ముఫ్తీ ఖలీల్ అహ్మద్, మహ్మద్ పాషా, ఇఫ్తెకారి పాషా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసంలో జరిపే సామూహిక ప్రార్ధనలకంటే.. మహమ్మారి నిర్మూలనే ప్రధమ కర్తవ్యంగా భావించి సామాజిక దూరాన్ని పాటించే నిమిత్తం ముస్లిం సోదరులంతా తమ ఇళ్ల వద్దనే ప్రార్థనలు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలకు పూర్తి మద్దతు ఇస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com