మీ సలహాలు, సూచనలు కావాలి.. దేశ ప్రజలకు రాహుల్ విజ్ఞప్తి

మీ సలహాలు, సూచనలు కావాలి.. దేశ ప్రజలకు రాహుల్ విజ్ఞప్తి
X

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మీ సలహాలు, సూచనలు మాకు కావాలంటూ ప్రజలనుద్దేశించి ట్వీట్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పూర్తిగా నష్టపోయాయని.. వాటిని గాడిలో పెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని రాహుల్ కోరారు. మీ అమూల్యమైన సలహాలు మాకు ఇవ్వాలని.. వాటి ద్వారా పరిస్థితిని చక్కదిద్దుదామని ట్వీటర్ వేదికగా కోరారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చైర్మన్ గా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ 11 మందితో ఒక సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రాహుల్ కూడా ఒక సభ్యుడిగా ఉన్నారు. ఈ కమిటీ ప్రస్తుత పరిస్థితులను అధ్యయనా చేసి.. కేంద్రానికి సలహాలు, సూచనలు ప్రకటించనుంది.

Tags

Next Story