ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ఇంటర్ బోర్డు
BY TV5 Telugu22 April 2020 6:23 PM GMT

X
TV5 Telugu22 April 2020 6:23 PM GMT
కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రైవేట్, అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్ అప్లికేషన్లను ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మీడియట్ బోర్డు ఆహ్వానించింది.2020-21 విద్యా సంవత్సరానికి గాను నూతన కళాశాలల అనుమతి కోసం bie.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. ఈ నెల 23వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. గ్రామీణ ప్రాంతాలలో 10,500, మున్సిపాలిటీలలో 27000 ఇన్‌స్పెక్షన్ ఫీజుగా నిర్ణయించినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. అప్లికేషన్ ప్రొసెసింగ్ ఫీజు 500 రూపాయలుగా పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. బోర్డు కార్యదర్శి వి. రామకృష్ణ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
Next Story