అంతర్జాతీయం

చైనాలో ముద్దుల పోటీ.. ఏం నాయనా కరోనా చాల్లా..

చైనాలో ముద్దుల పోటీ.. ఏం నాయనా కరోనా చాల్లా..
X

హమ్మయ్య.. అందరికీ అంటించేశాంగా.. ఇప్పుడు మేం ఫ్రీ.. మా దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గిపోతోంది.. అని కరోనా కట్టడికి విధించిన ఆంక్షలన్నీ తొలగించేస్తోంది చైనా ఒక్కొక్కటిగా. దీంతో అక్కడి కంపెనీలన్నీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. సామాజిక దూరం పాటించి ఇప్పటి వరకు తమ సహనాన్ని పరీక్షించుకున్న ఉద్యోగులకు ఓ చల్లటి వార్త చెప్పింది పర్నిచర్ కంపెనీ ఒకటి. ఇన్ని రోజులుగా మూత పడిన ఓ ఫర్నిచర్ సంస్థ ఇప్పుడు తెరుచుకుంది.

ఇక ఇందులో పనిచేసే ఉద్యోగులకు ముద్దుల పోటీ పెట్టి కొంత ఉత్సాహాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ పోటీలో కొన్ని జంటలు పాల్గొన్నాయి. పోటీల్లో భార్య భర్తలు కూడా పాల్గొన్నారు. ఓన్లీ ముద్దులే.. హగ్గులకు అవకాశం లేదు. సామాజిక దూరాన్ని పాటించడంలో భాగంగా ఇద్దరి మధ్యా ఓ గ్లాస్ ఏర్పాటు చేశారు మరి. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఫర్నిచర్ సంస్థ యజమాని మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు రెండు నెలల తరువాత పనిలోకి వచ్చారు. మరి పనిలో ఒత్తిడి తగ్గించాలంటే కొన్ని పరిమితుల్ని బ్రేక్ చేయాలి. అప్పుడే ఉత్సాహంగా పని చేయగలుగుతారు అని అంటున్నారు.

Next Story

RELATED STORIES