55 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా టెస్ట్..

55 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా టెస్ట్..

కరోనా.. ఎవరికి వస్తుందో ఎవరికి రాదో తెలుసుకోవడం కష్టంగా ఉంది. అయితే, పెద్ద వారు కొంచెం త్వరగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నందున 55 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని చెబుతోంది కర్ణాటక వైద్య శాఖ. కరోనా మృతుల్లో 55-80 ఏళ్లలోపు వారే అధికంగా ఉంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు వైద్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్. ఈ వయసు వారు శ్వాస కోశ సమస్య ఏ మాత్రం అనిపించినా వచ్చి కరోనా టెస్టులు చేయించుకోమని చెబుతున్నారు. సరైన అవగాహన లేని వృద్ధులు చివరి దశలో ఆస్పత్రికి వస్తున్నారని అందుకే

వారిలో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందనీ ఆయన అన్నారు. ఇదిలా ఉండగా ల్యాబ్‌లలో పరీక్షలు సరిగా చేయడం లేదంటూ వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. రోజుకు 2వేల మందికి పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story