బియ్యంతో శానిటైజర్ తయారీ..

ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను తయారు చేయడానికి మరియు పెట్రోల్‌తో కలపడానికి గోదాముల్లో ఉంచిన మిగులు బియ్యాన్ని వాడవచ్చనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించింది. జాతీయ జీవ ఇంధన సమన్వయ కమిటీ (ఎన్‌బిసిసి) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన ఈరోజు ఎన్‌బిసిసి సమావేశం జరిగింది.
ఇటీవల, ప్రభుత్వం చక్కెర కంపెనీలు మరియు డిస్టిలరీలను ఇథనాల్ ఉపయోగించి హ్యాండ్ శానిటైజర్లను తయారు చేయడానికి అనుమతించింది. చక్కెర కంపెనీలు పెట్రోల్‌లో కలపడానికి చమురు మార్కెటింగ్ సంస్థలకు ఇథనాల్ సరఫరా చేస్తాయి. ఇందులో కొంత భాగాన్ని ఉపయోగించి హ్యాండ్ శానిటైజర్లు తయారు చేయాలని చక్కెర పరిశ్రమ గత వారం తెలిపింది. స్టేట్ ఎక్సైజ్, స్టేట్ డ్రగ్ కంట్రోలర్ల సహకారంతో చక్కెర కంపెనీలు హ్యాండ్ శానిటైజర్ల ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించారు. దీంతో శానిటైజర్లు తక్కువ ధరకు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు ఎఫ్‌సిఐ గోడౌన్లలో నిల్వ ఉన్న మిగులు బియ్యంతో శానిటైజర్ల తయారీకి ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే గోడౌన్లలో 58.49 మిలియన్ టన్నుల ఆహారధాన్యం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com