అంతర్జాతీయం

అమెరికాలో ఆగని కరోనా విజృంభణ.. 24 గంటల్లో..

అమెరికాలో ఆగని కరోనా విజృంభణ.. 24 గంటల్లో..
X

అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు.. 24 గంటల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనా భారిన పడి 2,804 మంది ప్రాణాలు కోల్పోయారు.. అంతేకాదు కొత్తగా 25,985 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మరణాల సంఖ్య దేశవ్యాప్తంగా 45 వేలు దాటింది. అదే సమయంలో, సోకిన వారి సంఖ్య ఎనిమిది లక్షలా 18 వేల 744 కు చేరుకుంది. ఇదిలావుంటే అమెరికాలో స్థిరపడే విదేశీయులను నిషేధించే ఉత్తర్వుపై త్వరలో సంతకం చేస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

60 రోజుల పాటు దేశంలోకి వచ్చే వలసదారులపై నిషేధం ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ వివాదాస్పద చర్య అమెరికా ఉద్యోగాలను కాపాడుతుందని అంటున్నారు. కొరోనావైరస్ మహమ్మారితో దేశం ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ఇది ఎంతో మేలు చేస్తుందని ఆయన ప్రస్తావించారు.

Next Story

RELATED STORIES