ఉత్తర ప్రదేశ్‌లో కొత్తగా 153 వైరస్ కేసులు

కరోనావైరస్ ప్రభావం ఉత్తర ప్రదేశ్‌లో వేగంగా వ్యాపిస్తోంది. ఆగ్రా , లక్నోలో గరిష్ట సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఆగ్రాలో 300 వైరస్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ సోకిన వారి సంఖ్య మంగళవారం 1337 కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 22 మంది మరణించారు.

గత 24 గంటల్లో యూపీలోని వివిధ జిల్లాల నుంచి 153 కొత్త కేసులు నమోదయ్యాయి. మంగళవారం అర్థరాత్రి, ఆగ్రాలో 13 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అలాగే మంగళవారం ఫిరోజాబాద్‌లో ఆరు వచ్చాయి.. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 62 కి పెరిగింది. ఇక లక్నోలో 181 మంది కోవిడ్ రోగులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం, కొత్తగా 153 మందికి సోకడంతో దీనితో, సంక్రమణ జిల్లాలు 53 కు చేరుకున్నాయి. 10 జిల్లాలను కరోనా రహిత జిల్లాలుగా ప్రకటించారు.

Tags

Next Story