ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఎవరూ రాకుండా జాగ్రత్త పడ్డ భద్రతా దళాలు

జమ్మూ కాశ్మీర్‌లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయిన సంగతి తెలిసిందే. భారత భద్రతా దళాలు వీరిని మట్టుబెట్టాయి. దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. దీంతో ఈ ఏడాది భారత్ చేతిలో మరణించిన మొత్తం ఉగ్రవాదుల సంఖ్య 50 కి పైగా ఉంది. అయితే బుధవారం మరణించిన ఉగ్రవాదుల పేర్లను
మాత్రం బయటికి చెప్పలేదు.
దీనికి కారణం ఉగ్రవాదుల మద్దతుదారులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో అంత్యక్రియల్లో పాల్గొనకుండా ఉండటానికి ఈ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఉగ్రవాదుల మృతదేహాలకు శవపరీక్ష చేసిన అనంతరం.. మేజిస్ట్రేట్ సమక్షంలో భద్రతా దళాలు డీఎన్‌ఏ నమూనాలను తీసుకున్నాయి. చనిపోయిన ఉగ్రవాదుల్లో ఒక ఉగ్రవాది కుటుంబసభ్యులు మాత్రమే పోలీసుల వద్దకు వచ్చారు.. చనిపోయింది తమ కుటుంబ సభ్యుడే అని వారు గుర్తిస్తే ఖననం చెయ్యడానికి ఇద్దరు లేదంటే ముగ్గురిని అనుమతిస్తామని వారికి చెప్పినట్టు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com