ప్రధాని మోదీకి బిల్‌గేట్స్ ప్రశంసలు

కోవిడ్ -19 సంక్షోభాన్ని అధిగమించడానికి, భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రధాని మోదీ చేపట్టిన విస్తృతమైన చర్యలను అభినందిస్తూ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదికి ఒక లేఖ రాశారు. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చురుకైన చర్యలను మేము అభినందిస్తున్నాము అని అందులో పేర్కొన్నారు బిల్ గేట్స్.
అలాగే దేశం మొత్తం లాక్‌డౌన్‌ను విధించడం, రోగులను ఐసోలేషన్ చెయ్యడం, ఇతరుల సంరక్షణ కోసం హాట్‌స్పాట్‌లను గుర్తించడానికి ఫోకస్డ్ టెస్టింగ్‌ను విస్తరించడం, ఆరోగ్య వ్యవస్థ సేవలను మరింత బలోపేతం చేయడం వంటి చర్యలు మోదీ పనితీరుకు అద్దం పడుతున్నాయని అన్నారు. అంతేకాదు ఆరోగ్య సేతు లాంటి అసాధారణమైన డిజిటల్ సామర్థ్యాలను ఉపయోగించుకున్నందుకు భారత ప్రభుత్వాన్ని బిల్ గేట్స్ ప్రశంసించారు. ప్రజలకు సామాజిక భద్రత కల్పించినందుకు మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. కాగా భారతదేశానికి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా కరోనా కట్టడికి కొంత సహాయం చేస్తున్నారు బిల్ గేట్స్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com