చైనాలో మరోసారి పెరిగిన పాజిటివ్ కేసులు

X
కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రమైన చైనాలో మరోసారి కేసులు సంఖ్య పెరుగుతోంది. తగ్గినట్టే తగ్గి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 30 కేసులు అంమోదు కాగా.. బుధవారం కొత్తగా మరో 10 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. నమోదైన 10 కేసులలో 6 విదేశాల నుంచి వచ్చిన వారే అని చెప్పింది.
అంతేకాదు మంగళావారం నమోదైన 30 కేసులలో 23 కేసులు కూడా విదేశాల నుంచి చైనాకు తిరిగి వచ్చిన వారి ద్వారా సంక్రమించాయని స్పష్టం చేసింది. చైనాలో ఇప్పటివరకూ ధృవీకరించబడిన కరోనావైరస్ కేసుల సంఖ్య ఇప్పుడు 82,798 గా ఉంది. కొత్త COVID-19 మరణాలు ఏవీ నివేదించబడలేదు, మూడు రోజుల క్రితం మరణాల సంఖ్య 4,632 గా ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
