శానిటైజర్లతో వెళ్తున్న లారీలో మంటలు.. నడిరోడ్డుపై కాలి బూడిద

శానిటైజర్లతో వెళ్తున్న లారీలో మంటలు.. నడిరోడ్డుపై కాలి బూడిద

శానిటైజర్లతో వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో శానిటైజర్ల డబ్బాలతో సహా లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం మియాపూర్‌-బొల్లారం రోడ్‌లో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

జీడిమెట్ల నుంచి సంగారెడ్డి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్లతో వెళ్తున్న లారీకి మంటలు అంటుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. లారీలో ఒక్కొక్క క్యాన్‌లో 20 లీటర్ల శానిటేషన్ ద్రావణం ఉంది. క్యాన్లలో ఉన్న శానిటేషన్ ద్రావణం పూర్తిగా అల్కహాల్‌ మిశ్రమంతో కూడిన ద్రావణం కావడంతో మంటలు తొందరగా అదుపులోకి రాలేదని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story