మెక్సికోలో ఇప్పుడిప్పుడే వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా.. 24 గంటల్లో..

మెక్సికోలో ఇప్పుడిప్పుడే వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా.. 24 గంటల్లో..

మెక్సికోలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. 24 గంటల్లో ఇక్కడ 1,043 కేసులు నమోదయ్యాయి, అంతేకాదు 113 మంది మరణించారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య మొత్తంగా 970 ఉంది. ఈ విషయాలను డిప్యూటీ హెల్త్ మినిస్టర్ హ్యూగో లోపెజ్-గాటెల్ వెల్లడించారు. దేశంలో ఫిబ్రవరి 28న మొదటి కరోనా కేసు నమోదైనప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 10,544 కేసులు నిర్ధారించబడ్డాయి.

ఒక రోజు ముందు (మంగళావారం) కొత్తగా 729 కేసులు నమోదయితే, 145 మంది మరణించారు.. బుధవారం ఈ సంఖ్య ఒక్కసారిగా పెరగడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇక మెక్సికోకు సమీపాన ఉన్న అమెరికాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇప్పటివరకూ 47 వేల మందికి పైగా మరణించారు. 8 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story