ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర..

X
By - TV5 Telugu |23 April 2020 5:57 PM IST
ఆరోగ్య కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. వెంటనే గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. దీంతో తక్షణమే ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం మామూలు దాడులకు రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా లేదా మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. తీవ్ర దాడి జరిగి, బాధితులకు గాయాలు అయితే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా ఉంటుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com