కరోనా ఎక్కడుందో.. ఎందుకైనా మంచిది.. ఫోన్స్ లోపలికి తీసుకురావద్దు

కరోనా వైరస్ చేతుల మీద ఉండొచ్చని చేతులు శుభ్రంగా కడుక్కోమంటున్నారు. మరి మనం వాడే మొబైల్స్ పొద్దున్న లేచిన దగ్గర్నుంచి మనతోనే, మనచేతుల్లోనే అంటిపెట్టుకుని ఉంటాయి కదా మరి వాటిని ఏంచేయాలి. అది లేందే ఒక్క క్షణం గడవదే. అన్నం నీళ్లు లేకపోయినా పర్లేదు.. అరచేతిలో ఫోన్ ఉండాల్సిందే. మరి ఇప్పుడు దానివాడొద్దంటే ఎలా.. అలా అని ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు కానీ..
ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన గైడ్ లైన్స్ ప్రకారం ఎందుకైనా మంచిదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హాస్పిటల్‌కి వచ్చే రోగులు, వైద్య సిబ్బంది, డాక్టర్లతో సహా ఎవరూ మొబైల్స్ లోపలికి తీసుకురాకూడదని స్ట్రిక్ట్‌గా రూల్స్ పాస్ చేసింది. హాస్పిటల్ ఆవరణలోనే మీ మొబైల్స్ ఉంచి లోపలికి రమ్మని ఆజ్ఞలు జారీ చేసింది. మీరు ఇంటికి వెళ్లేటప్పుడు మీ మొబైల్స్ తీసుకువెళ్లండి అని చెప్పింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com