స్థానిక దుకాణాలకు అమెజాన్ సహాయం.. ఆన్‌లైన్‌లో విక్రయం

స్థానిక దుకాణాలకు అమెజాన్ సహాయం.. ఆన్‌లైన్‌లో విక్రయం
X

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన పైలట్ ప్రాజెక్టు 'లోకల్ షాప్ ఆన్ అమెజాన్' లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టును బలోపేతం చేయడానికి రూ .10 కోట్లు పెట్టుబడి పెట్టింది, దేశంలోని 100 కి పైగా నగరాలలో.. 5,000 స్థానిక దుకాణాలను , రిటైలర్లను 'లోకల్ షాప్ ఆన్ అమెజాన్' ప్లాట్‌ఫామ్‌లోకి తెచ్చింది.

దీనిద్వారా భారతదేశంలోని స్థానిక షాపుల నుంచి వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించడానికి శక్తిమేర కృషిచేస్తామని ఇ-కామర్స్ దిగ్గజం తెలిపింది. ఆన్‌లైన్ రిటైలర్ ప్రకారం, వినియోగదారులకు స్థానిక షాపుల నుండి వేగంగా డెలివరీ ఉంటుందని అమెజాన్ భావిస్తోంది. అంతేకాకుండా, దుకాణదారులు తమ సాధారణ ప్రాంతానికి మించి వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఇది సహాయపడుతుందని చెబుతోంది.

Tags

Next Story