అంతర్జాతీయం

యూకేలో రోజురోజుకు పెరుగుతోన్న మరణాలు.. వారికి పరీక్షలు ఉచితం

యూకేలో రోజురోజుకు పెరుగుతోన్న మరణాలు.. వారికి పరీక్షలు ఉచితం
X

యూకేలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. కోవిడ్-19 కారణంగా గత 24 గంటల్లో 616 మంది మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 18,738 కు చేరింది, కరోనావైరస్ కోసం పరీక్షలను వేగవంతం చేయడానికి UK ప్రభుత్వం గురువారం అనేక చర్యలు తీసుకుంది. అనేక ప్రాంతాల్లో ల్యాబ్ లను తెరిచింది. యూకేలో భౌగోళిక డేటా ప్రకారం సమాచార వ్యవస్థ ప్రకారం ఇంగ్లాండ్, వేల్స్ , స్కాట్లాండ్ , ఉత్తర ఐర్లాండ్ లో ఎక్కువగా మరణాలు సంభవించాయి. అలాగే కేసులు కూడా 138,078 కు చేరుకున్నాయి.

కాగా కోవిడ్ వ్యాధిని ఎదుర్కోవటానికి ముందు వరుసలో ఉన్న నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) సిబ్బందికి కోవిడ్ -19 పరీక్ష ఉచితంగా చెయ్యాలని యుకె ప్రభుత్వం నిర్ణయించింది. అనేక NHS హెల్త్‌కేర్ నిపుణుల మరణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. వ్యాధి భారీన పడిన హెల్త్‌కేర్ నిపుణులకు కొంతమందికి పరీక్షలు చెయ్యలేదు.

Next Story

RELATED STORIES