స్వీయ నిర్బంధంలోకి ఫిన్లాండ్ ప్రధాని

X
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ఈ కరోనా వైరస్ ఫిన్లాండ్పై కూడా పంజా విసిరింది. ఫిన్లాండ్లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి. ఫిన్లాండ్ దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4284 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ బారిన పడి దేశంలో ఇప్పటి వరకు 172 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ మహమ్మారి భయం ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌ను వెంటాడుతోంది. ప్రధాని కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తి కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా ప్రధాని మారిన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అంతేకాకుండా ప్రధాని కార్యాలయంలోని చాలామంది సిబ్బంది కూడా నిర్బంధంలోకి వెళ్లారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
