ప్ర‌ముఖ హీరోయిన్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్‌

సెలబ్రిటీలకు చెందిన సోష‌ల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ కావడం ఈ మధ్యకాలంలో చాలా కామన్ అయిపోయింది. ఇదివరకు చాలా అలా హ్యాక్ కు గురయ్యాయి. గతంలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, నటుడు షాహిద్ కపూర్‌ ట్విటర్‌ అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయి. తాజాగా దక్షణాది సీనియర్ నటి, ప్రముఖ క్లాసికల్ డాన్సర్ శోభన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. లాక్ డౌన్ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ డాన్స్ ద్వారా ఒత్తిడిని ఎలా నియంత్రించుకోవచ్చో తెలియజేస్తూ ఫేస్ బుక్‌లో పలు వీడియోను విడుదల చేస్తున్నారు శోభన. ఇప్పుడు ఈ ఫేసు బుక్ అకౌంట్ హాక్ అయింది. ఈ విష‌యాన్ని శోభ‌న త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం పోలీసులు, సైబర్ క్రైమ్ దీనిపై విచార‌ణ చేస్తున్నారని శోభన తెలిపారు.

తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు శోభ‌న. సినిమాల్లో మంచి క్రేజ్ వున్న ద‌శలోనే తెలుగులో న‌టించ‌డ‌ం మానేశారు. అప్పుడ‌ప్పుడు మ‌ల‌యాళ చిత్రాల్లో అలా మెరిసి వెళ్లేవారు. ఇటీవ‌ల దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించి నిర్మించిన 'వారానే అవ‌శ్య‌ముడ్‌' చిత్రంలో న‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటున్నా కూడా త‌న‌కు ఇష్ట‌మైన క్లాసిక‌ల్ డ్యాన్స్‌తో దేశ విదేశాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story