మహిళల యూరో 2022కి వాయిదా

X
కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరగాల్సిన మహిళల యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ రెండేళ్లు వాయిదా పడింది. ఈ పోటీలు 2022 జూలైలో జరుగుతాయని UEFA పేర్కొంది. ఈ ఏడాది జరగాల్సిన పురుషుల యూరో టోర్నీని వచ్చే ఏడాదికి వాయిదా వేయడంతో మహిళల ఈవెంట్ తేదీల్ని కూడా మార్చాల్సి వచ్చిందని పేర్కొంది.
వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సాకర్ మ్యాచ్‌లు ఉన్న నేపధ్యంలో దీనికి సముచిత ప్రాధాన్యమివ్వాలనే ఉద్ధ్యేశంతో రెండేళ్లు వాయిదా వేశామని యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (యూఈఎఫ్ఏ) అధ్యక్షుడు అలెగ్జాండర్ సెఫెరిన్ అన్నారు. కాగా మహమ్మారి కారణంగా ఐరోపా అంతటా 110,000 మందికి పైగా మరణించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
