అంతర్జాతీయం

కరోనా ఎఫెక్ట్: ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం..

కరోనా ఎఫెక్ట్: ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం..
X

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. లాక్డౌన్ కారణంగా ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అమెరికాలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండేలా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్ మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా పెద్ద సంఖ్యలో కంపెనీలు మూత పడ్డాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించి వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఆరుగురిలో ఒకరు తమ ఉపాధిని కోల్పోతున్నారు. 1930 నాటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయని తాజా సమాచారం.

1931-40 మధ్య కాలంలో నిరుద్యోగ రేటు 14 శాతానికి పైగా ఉండేది. ఒకానొక సమయంలో అది 25 శాతానికి కూడా చేరుకుందని లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ సంక్షోభంలో వచ్చే ఏడాదికి నిరుద్యోగ రేటు 10 శాతం పైనే ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఆరుగురిలో ఒకరు కరోనా కారణంగా ఉద్యోగం నుంచి తొలగించబడ్డారు. ఇదిలా ఉండగా గత వారం 44 లక్షల మంది అమెరికన్లు నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

Next Story

RELATED STORIES