అంతర్జాతీయం

ఇద్దరికి కరోనా వ్యాక్సీన్ ఇచ్చిన యూకే

ఇద్దరికి కరోనా వ్యాక్సీన్ ఇచ్చిన యూకే
X

చైనాలోపుట్టిన క‌రోనా వైర‌స్ ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 27 ల‌క్ష‌ల 60 వేల మందికిపైగా ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ల‌క్షా 93 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మ‌హ‌మ్మారికి ఎటువంటి మందు గానీ, వ్యాక్సిన్ గానీ లేదు. ఇప్పుడిప్పుడే యూకేలోని ఆక్స్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ను రెడీ చేసి ప్రయోగిస్తున్నారు. ఈ ప్రయోగం గురువారం ఆక్స్‌ఫర్డ్‌లో ప్రారంభమైంది, అధ్యయనం కోసం నియమించిన 800 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లలో మొదటి ఇద్దరికి ChAdOx1 nCoV-19 అనే కొత్త వ్యాక్సిన్‌ ను ఇంజెక్ట్ చేశారు. వీరిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు.

టీకాలు వేసిన మొదటి రెండు రోజుల్లో కొందరికి గొంతు, తలనొప్పి లేదా జ్వరాలు రావచ్చని వారికి ముందే చెప్పారు. వీటికి మానసికంగా సిద్ధంగా ఉండాలని కూడా వారికి సూచించారు. కాగా 800 మంది వాలంటీర్లతో సగం మందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ ఇస్తుండగా.. మిగతా సగమందికి మెనింజైటిస్ (meningitis) నుంచి ప్రొటెక్ట్ చేసే కంట్రోల్ వ్యాక్సిన్ ఇస్తారు. కాగా ప్రపంచాన్ని నాశనం చేస్తూ ఉన్న వైరస్‌కు వ్యతిరేకంగా విరుగుడు వస్తుందనే ఆశలను పెంచుతూ క్లినికల్ ట్రయల్స్‌లో మొదటి దశలోకి ప్రవేశించిన ఆరవ కరోనావైరస్ వ్యాక్సిన్ ఇది. ట్రయల్స్ విజయవంతమైతే, సెప్టెంబరు నాటికి ఒక మిలియన్ మోతాదులను సిద్ధం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు మరియు ఆ తరువాత తయారీని పెంచుతారు.

Next Story

RELATED STORIES