ఒక్కరోజులో 1,752 పాజిటివ్‌ కేసులు

ఒక్కరోజులో 1,752 పాజిటివ్‌ కేసులు
X

భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఒక్కరోజులో 37 మంది కరోనాతో మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతేకాదు కొత్తగా ఒకేరోజులో 1,752 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 23,452కు చేరుకుంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో మొత్తం మరణాల సంఖ్య 723కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ తన అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది. 4,813 మంది కరోనా భారిన పడి విజయవంతంగా కోలుకున్నారు. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 20.52 శాతం మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం వీరు డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఈ క్రమంలో మరణాలు, డిశ్చార్జ్ సంఖ్య పోనూ, 17,915 మంది చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story