ప్రార్థనలు ఇంట్లోనే చేసుకోండి.. పేదలకు సాయం చేయండి: అసదుద్దీన్ ఒవైసీ

ప్రార్థనలు ఇంట్లోనే చేసుకోండి.. పేదలకు సాయం చేయండి: అసదుద్దీన్ ఒవైసీ
X

పవిత్ర రంజాన్ మాస ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకోవాలని ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని అన్నారు. అందులో భాగంగానే ఇళ్ల వద్ద కూడా సమ్మేళన ప్రార్థనలకు దూరంగా ఉండాలని కోరారు. ఆకలితో ఉన్న పేద వారికి అన్నం పెట్టడం అతి పెద్ద ధర్మమని ఆయన అన్నారు. లాక్‌డౌన్ ముగిసిన తరువాత కూడా సినిమా హాల్స్, బహిరంగ సభలు వంటి వాటిపై ఆంక్షలు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గిడ్డంగులలో నిల్వ ఉన్న బియ్యాన్ని పేద, వలస కార్మికులకు పంపిణీ చేయాలని అన్నారు. ఈ బియ్యాన్ని శానిటైజర్లకు ఉపయోగించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు.

Tags

Next Story