షాపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర హోంశాఖ

షాపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర హోంశాఖ
X

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు, వ్యాపారులు డిమాండ్ చేస్తుండటంతో కేంద్ర హోంశాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు అవసరమైన షాపులను తెరుచుకోవచ్చని పేర్కొంది. అయితే దీనికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వం అనుమతి ఉండాలని సూచింది. కేవలం రిజిస్టర్ అయిన షాపులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అయితే షాపులకు వెళితే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో కచ్చితంగా భౌతిక దూరంపాటిస్తూ, మాస్క్ వాడటం తోపాటు, శానిటేజర్లు వాడాలి. ఇక ఇప్పటివరకూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కిరాణా షాపులు, నిత్యవసర, అత్యవసర, మందులు, ఫార్మసీ షాపులకు మాత్రమే అనుమతి ఉంది.. కానీ తాజాగా మరికొన్ని రకాల షాపులకు అనుమతి ఇచ్చింది. ఇక కేంద్రం ఇచ్చిన జాబితాలో అనుమతులు ఇలా ఉన్నాయి.

అనుమతి ఉన్నవి :

*స్టేషనరీ షాపులు, బ్యూటీ సెలూన్స్, డ్రై క్లీనర్స్, ఎలక్ట్రికల్ స్టోర్స్ వంటివి అన్నీ తెరచుకోవచ్చు.

*మునిసిపల్ కార్పొరేషన్లు , మునిసిపాలిటీల వెలుపల.. నివాస సముదాయాలు, మార్కెట్ కాంప్లెక్స్‌లలో ఉన్న దుకాణాలను తెరవడానికి అనుమతిస్తారు.

*షాపులు కూడా సగం మంది ఉద్యోగులతోనే నడపాలి.

అనుమతిలేనివి :

* దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి అనుమతి లేదు.

*సినిమా హాళ్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, వ్యాయామశాలలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, థియేటర్లు, బార్‌లు , ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్‌ లకు అనుమతి లేదు

*మద్యం షాపులకు అనుమతి లేదు.

*అలాగే హాట్ స్పాట్లు, కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నచోట మాత్రం ఏ రాష్ట్రంలోనైనా సరే, షాపులు తెరవడానికి అనుమతి లేదు.

Tags

Next Story