భారతీయులను కరోనా నుంచి కాపాడుతున్న శక్తి అదే: చైనా

భారతీయులను కరోనా నుంచి కాపాడుతున్న శక్తి అదే: చైనా

చైనా తరువాత అధిక జనాభా ఉన్న దేశం భారత దేశం. అయినా ఇక్కడ కరోనా కేసులు మిగతా దేశాలతో పోల్చుకుంటే తక్కువగానే నమోదవుతోంది. దీనికి కారణం వారి మానసిక శక్తి, వారి ప్రశాంత మనస్తత్వం అని చైనాలోని ప్రముఖ వైద్య నిపుణుడు ఝాంగ్ వెన్‌హాంగ్ అంటున్నారు. ఆయన భారత్‌లో ఉన్న చైనా విద్యార్ధులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చైనా విద్యార్ధులకు ధైర్యం చెబుతూ.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారి బారికి తట్టుకోలేకపోతున్న ప్రస్తుత తరుణంలో.. భారత్ కామ్‌గా తనపని తాను చేసుకుపోతోంది. లాక్‌డౌన్ విధించి వ్యాధి వ్యాప్తి నిరోధాన్ని అడ్డుకుంది.

ముఖ్యంగా భారతీయులకు కరోనా మహమ్మారిని తట్టుకునే రోగ నిరోధక శక్తి లేకపోయినా వారి మానసిక శక్తే వారిని కాపాడుతోంది అని విద్యార్ధులకు వివరించారు. భారతీయులు మాస్కుల్లేకుండానే అధ్యాత్మిక ప్రదేశాలకు వెళుతుండడం నేను చూశాను అని విద్యార్థులతో అన్నారు. భారత్‌లో కరోనా వ్యాప్తి 10 శాతం కూడా మించదని, మీ చుట్టూ ఉండే 90 శాతం మంది వైరస్ సోకని వారేనని ఆయన తమ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చైనాలోని షాంఘైలోని హౌషన్ ఆసుపత్రిలో అంటువ్యాధుల విభాగానికి డైరక్టర్‌గా ఉన్నారు. కాగా, ప్రపంచం మొత్తం మీద కరోనా బారిన పడిన కేసులు శుక్రవారం నాటికి 27 లక్షల మంది ఉండగా, లక్షా 90 వేల మంది మృత్యువత పడ్డారు. ఇక భారత విషయానికి వస్తే ఇప్పటి వరకు 23 వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా 718 మంది మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story