లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ .. హైదరాబాద్‌లో 11 లక్షల వాహనాలకు జరిమానా

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. ఈ ప్రాణాంతకర కరోనాని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించింది. అయితే అత్యవసరమైతే మినహా ప్రజలు రోడ్లపైకి రాకూడదని ప్రభుత్వాలు ప్రజలకు సూచించారు. అయితే కొందరు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై యదేచ్ఛగా తిరుగుతున్నారు. దీంతో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన నెల వ్యవధిలో హైదరాబాద్‌లో 11 లక్షల వాహనాలకు జరిమానా విధించారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో 4.65 లక్షల వాహనాలకు జరిమానా విధించగా, 45 వేల వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ పరిధిలో 5.39 లక్షల వాహనాలకు జరిమానా విధించగా, 12 వేల వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 87 వేల వాహనాలకు జరిమానా విధించగా, 5,337 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Next Story