డీఏ నిలిపివేయడం సరైన నిర్ణయం కాదు : మాజీ ప్ర‌ధాని

డీఏ నిలిపివేయడం సరైన నిర్ణయం కాదు : మాజీ ప్ర‌ధాని
X

కరోనావైరస్ సంక్షోభం కారణంగా కేంద్రం ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ఇటీవల పెంచిన కరువు భత్యాన్ని (డీఏ) కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. 2021 జూలై వరకు పెంచిన కరువుభత్యం(డీఏ) చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. దాంతో దేశంలో మొత్తం 50 లక్షల మంది ఉద్యోగుల తోపాటు 61 లక్షల మంది పింఛనుదారులపై భారం పడనుంది. అయితే ఈ చర్యను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యతిరేకించారు. ప్రస్తుత సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏను నిలిపివేయడం సరైన నిర్ణయం కాదని.. ఈ కష్టకాలంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు, ర‌క్ష‌ణ ద‌ళాల‌పై భారం వేయ‌డం మంచిది కాదన్నారు.

Tags

Next Story