25 April 2020 4:58 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / భారత సంతతికి అమెరికాలో...

భారత సంతతికి అమెరికాలో అరుదైన గౌరవం

భారత సంతతికి అమెరికాలో అరుదైన గౌరవం
X

భారత సంతతికి చెందిన రేణు ఖాటోర్‌కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయం ఛాన్స్‌లర్‌గా ఉన్న ఆమె.. ప్రఖ్యాత అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెన్స్‌కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. విద్యారంగంలో విశేష కృషి చేసినందుకు గాను ఆమెకు ఈ గౌరవం లభించింది. యూనివర్సిటీ ఆఫ్‌ హ్యూస్టన్‌ సిస్టమ్‌ ఛాన్స్‌లర్‌గా, వర్సిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె ఉత్తర్‌ప్రదేశ్ లో జన్మించారు. ఆ యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా ఎన్నికైన మొట్టమొదటి మహిళ గా పైగా ఆమె పేరుగాంచింది. పలు రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులను ఏఏఏఎస్‌కు ఎంపిక చేస్తుంటారు. ఇప్పటి వరకు 250 మంది నోబెల్‌ బహుమతి గ్రహీతలు, పులిట్జర్‌ ప్రైజ్‌ విన్నర్లును ఏఏఏఎస్‌కు ఎంపిక చేశారు. ఈ అకాడమీని 1780లో ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రముఖుల సరసన తనను చేర్చడం పట్ల రేణు ఖాటోర్‌ సంతోషం వ్యక్తం చేశారు.

Next Story