70 ఏళ్ల వయసులో తండ్రి అయిన హీరో

X
ఓ స్టార్ హీరో 70 ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడు. అవును మీరు చదువుతున్నది నిజమే. హాలీవుడ్ స్టార్ హీరో రిచర్డ్ గేర్ 70 ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడు. 37 ఏళ్ల అలెజాండ్రా సిల్వా తో కలిసి రిచర్డ్ ఓ మగబిడ్డకు జన్మనివ్వడం సంచలనంగా మారింది. అయితే రిచర్డ్ కిది మూడో సంతానం కావడం విశేషం. అతడి మొదటి భార్యతో ఇప్పటి కే రిచర్డ్ కు 20 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి కొన్నేళ్ల కిందటే సోషల్ యాక్టివిస్ట్ అలెజాండ్రా సిల్వాను పెళ్లాడాడు. వీరికి గత ఏడాది ఓ కొడుకు పుట్టాడు. మళ్లీ ఏడాది తిరిగేసరికి ఈ జంటకు ఓ కొడుకు జన్మించాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
