సూర్యకిరణాలకు కరోనాను కట్టడి చేసే శక్తి..!!

సూర్యకిరణాలకు కరోనాను కట్టడి చేసే శక్తి..!!

ఓ ఊరటనిచ్చే అంశం.. కరోనా వేసవి కాలంలో తగ్గొచ్చుఅని.. ఓ బాధ.. కరోనా చలికాలంలో మళ్లీ పెరగొచ్చు అని. సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు ఎలాంటి వైరస్‌ని అయినా ఎదుర్కునే శక్తిని కలిగి ఉంటాయి. ఈ కిరణాల నుంచి వెలువడే రేడియేషన్ వైరస్‌ యొక్క ప్రత్యుత్పత్తి జరగకుండా అడ్డుకుంటుంది. అలానే కరోనా వైరస్‌ని నాశనం చేసే శక్తిని కూడా ఈ కిరణాలు కలిగి ఉంటాయని అమెరికాకు చెందిన అధికారులు తాజా పరిశోధనలో వెల్లడించారు. అందువల్లే వేసవి కాలంలో కరోనా వ్యాప్తి తగ్గవచ్చనే అభిప్రాయాన్ని అమెరికా శాస్త్ర సాంకేతిక రంగానికి చెందిన సలహాదారు విలియం బ్రయాన్ తెలిపారు.

అయితే ఈ పరిశోధనలు మరింత విస్తృతంగా చేసిన మీదటనే బహిర్గతం చేస్తామని అంటున్నారు. అతినీలలోహిత కిరణాల తీవ్రత ఎంత ఉంటే కరోనా వైరస్ నిర్మూలితమవుతుందనే అంశం ఆ తర్వాతే తెలుస్తుందని అన్నారు. ఈ విషయాలను మీడియాకు వెల్లడించిన బ్రయాన్ దక్షిణార్థగోళంలో కరోనా కేసులు తక్కువగా ఉండడానికి కారణం అక్కడ ఉన్న వేడి వాతావరణమే అని వివరించారు. వైరస్ పైన ఉండే రక్షణ కవచం వేడి వల్ల శక్తి హీనం అవుతుందని అన్నారు. అయితే సూర్యరశ్మి వల్లే కరోనా పూర్తిగా అంతం అవుతుందన్న విషయాన్ని నిర్ధారించలేమని, వైరస్ వ్యాప్తి తగ్గాలంటే సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని అన్నారు. ఇప్పుడు ఈ వేసవిలో కొంత తగ్గుముఖం పట్టినా మళ్లీ శీతాకాలంలో వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్నాయన్నారు.

Tags

Read MoreRead Less
Next Story