ఆగ్నేయ బంగాళాఖాతంలో మే మొదటివారంలో అల్పపీడనం

X
By - TV5 Telugu |26 April 2020 9:27 PM IST
ఆగ్నేయ బంగాళాఖాతంలో మే మొదటివారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. దీంతో కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని.. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు, కూలీలు, పశు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com