జూబ్లీహిల్స్‌లో లక్షల విలువైన మద్యం స్వాధీనం

జూబ్లీహిల్స్‌లో లక్షల విలువైన మద్యం స్వాధీనం

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ వేగంగా వ్యాప్తి చేదుతోంది. దీంతో సర్కార్ కరోనాని కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. అయితే కొందరు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌పై వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతుండటంతో ఆ పబ్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. పబ్‌ నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు. రూ.15 లక్షల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించారు.

Tags

Read MoreRead Less
Next Story