చైనాపై విమర్శలెందుకు.. చేయాల్సిన పనులపై దృష్టి సారించండి: బిల్ గేట్స్

చైనాపై విమర్శలెందుకు.. చేయాల్సిన పనులపై దృష్టి సారించండి: బిల్ గేట్స్

చైనా నుంచే కరోనా వచ్చింది. అది అందరూ ఒప్పుకుని తీరాల్సిందే.. అయితే అక్కడ కరోనా వ్యాప్తి విస్తరించకుండా సత్వర నివారణ చర్యలు చేపట్టి చాలా వరకు కోవిడ్‌ను కట్టడి చేయగలిగింది. అది కొంత ఊరటనిచ్చే అంశం. ఇలాంటి సమయంలో దాదాపు ప్రపంచ దేశాలన్నీ చైనాను విమర్శించడం సరికాదన్నారు మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్. తాను చేసిన తప్పును పునరాలించుకోవాల్సిన బాధ్యత చైనాపై ఉందని ఆ దేశానికి హితవు పలికారు గేట్స్. సీఎన్ఎస్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వేరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా పలు దేశాలు వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నాయన్నారు. తద్వారా భారీ విపత్తునుంచి బయటపడ్డాయని ఆయన తెలిపారు. ఈ విషయంలో మాత్రం అమెరికా వెనుకబడిందన్నారు. మానవాళిని రక్షించే నిమిత్తం చర్యలు తీసుకోవాల్సిన తరుణంలో చైనాపై విమర్శలు తగదన్నారు. ఈ విధంగా చేయడం లక్ష్యాన్ని పక్కదారి పట్టించడమే అని అన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చర్యలను తప్పుపట్టడం కూడా సరికాదన్నారు. కరోనా కట్టడికి సంస్థ ఎనలేని కృషి చేస్తోందని అన్నారు.

నిజానికి ఆ సంస్థతో అమెరికాకే మెరుగైన సంబంధాలు ఉన్నాయని అన్నారు. డబ్ల్యూహెచ్‌వో.. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థతో కలిసి పనిచేసినంతగా మరే సంస్థతో కలిసి పనిచేయలేదన్నారు. ఇక, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున మరో 150 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. ఈ నిధులు కరోనా వైరస్‌పై పరిశోధనలకు, వ్యాక్సిన్లు కనుగొనడానికి వినియోగిస్తామని ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మిలిందా తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి డబ్ల్యూహెచ్‌వో ఒక్కటే సరైన వేదిక అని అమె అభిప్రాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story