అంతర్జాతీయం

చైనాలో గడిచిన 24 గంటల్లో మూడు కేసులు మాత్రమే..

చైనా 24 గంటల్లో మూడు కేసులను మాత్రమే నిర్ధారించింది. ఈ మూడు కేసుల్లో కూడా రెండు విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా నమోదు అయ్యాయి. ఈ విషయాన్నీ చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ సోమవారం నివేదించింది. దీంతో చైనాలో కరోనా కేసులు ఇప్పుడు 82 వేల 830 కు పెరిగాయి. ఇప్పటివరకు సుమారు 4,633 మంది మరణించారు. కోలుకున్న తర్వాత 77,400 మంది రోగులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అదే సమయంలో, వుహాన్లోని ఆసుపత్రులలో చేరిన రోగులందరూ కూడా డిశ్చార్జ్ అయ్యారు. కాగా వుహాన్ నగరం కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉంది.

Next Story

RELATED STORIES