ఓ వాచ్‌మెన్ 200 మంది నేపాలీలకు..

తన సంపాదనే అంతంత మాత్రం. తన వాళ్లు కాకపోయినా తన ఊరి వాళ్లు.. చుట్టు పక్కల ఊరి వాళ్లు. బతుకుదెరువు కోసం ఇంత దూరం వచ్చారు. ఆదుకునే వారు లేరు. లాక్‌డౌన్ వల్ల పని లేదు. ఊరు వెళ్లే మార్గం లేదు. అందుకే ఆ 200 మందికి తానే అండగా నిలిచాడు ఓ వాచ్‌మెన్. మహారాష్ట్ర పన్వెల్‌లో నైట్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు దర్బార్ బహదూర్ సాహీ. నేపాలీ నుంచి వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతం నుంచి వచ్చిన మరి కొన్ని కుటుంబాలు పన్వెల్లో కూలి పనులు చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా వారికి చేయడానికి పని దొరకట్లేదు. తినడానికి తిండి లేదు. అయితే వారందరికీ ఒక పూట భోజనమైనా పెట్టాలని భావించి వారికి కావలసిన నిత్యావసర వస్తువులను అందిస్తున్నాడు సాహీ. నా దగ్గర ఉన్న ఆహార పదార్ధాలు కూడా అయిపోతున్నాయి. ఎవరైనా సాయం చేసి వారి కడుపు నింపండి అని అర్ధిస్తున్నాడు. పాపం వాళ్లు ఒక్కపూటే తింటూ రోజులు గడుపుతున్నారు. నాకు చేతనైనంత సాయం నేను చేస్తున్నాను. ఎవరైనా సాయం అందిస్తే పిల్లలు పస్తులు పడుకోకుండా రెండో పూట తింటారు అని చెబుతున్నాడు సాహి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com