రూ.25 లక్షలతో మిడిల్ క్లాస్ ఫండ్ @ విజయ్ దేవరకొండ

రూ.25 లక్షలతో మిడిల్ క్లాస్ ఫండ్ @ విజయ్ దేవరకొండ
X

యూత్‌ని ఆకట్టుకునే హీరో విజయ్ దేవరకొండ.. ఏది చేసినా స్పెషల్‌గా ఉండాలనుకుంటాడు. కరోనా సంక్షోభ సమయంలో నిత్యావసరాలు లేక ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు 25 లక్షల రూపాయలతో మిడిల్ క్లాస్ ఫండ్ (ఎం.సి.ఎఫ్) ఏర్పాటు చేశారు. అలాగే యువతకు ఉద్యోగాలు ఇప్పించేందుకు 'ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్' (టి.డి.ఎఫ్) ను ఏర్పాటు చేశారు. తన జీవితంలో ఒక లక్ష మందికి ఉద్యోగులను తయారు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు విజయ్ తెలిపాడు. అలాగే లాక్‌డౌన్ వేళ కనీస అవసరాలు తీర్చుకోలేక అవస్థలు పడుతున్న వారి కోసం www.thedeverakondafoundation.org లాగిన్ అయి తమ వివరాలను నమోదు చేసుకుంటే ఫౌండేషన్ సభ్యులు స్వయంగా వారికీ నిత్యావసర సరుకులు అందిస్తారు. రూ.25 లక్షలతో 2000 కుటుంబాల అవసరాలు తీర్చాలని లక్ష్యం పెట్టుకున్నట్లు విజయ్ దేవరకొండ తెలిపారు.

Tags

Next Story