విజయవాడలో మూడు డేంజర్ జోన్లు..

ఆంధ్రప్రదేశ్‌లో అందునా కృష్ణా జిల్లా విజయవాడలో కరోనా పాజిటివ్ కేసులు వారం రోజుల్లో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో ఈ నెల 18 వరకు 74 కేసులుండగా, వారం తిరక్కముందే ఆ సంఖ్య 177కి చేరుకుంది. ఈ పెరుగుదలకు ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు వైద్యులు. ఆదివారం నాటికి 117 కేసులు నమోదు కాగా, వాటిలో 100కి పైగా కేసులు కేవలం కృష్ణలంక, మాచవరం కార్మికనగర్, కుమ్మరిపాలెం ప్రాంతాల్లోనే కావడం ఆందోళన కలిగిస్తోంది. కృష్ణలంకలో నివసిస్తున్న ఓ లారీ డ్రైవర్ కారణంగా 24 మంది వైరస్ బారిన పడ్డారు. ఈ 24 మంది మరెంత మందికి వైరస్ వ్యాప్తి చేసి ఉంటారో అనే విషయం ఊహించడానికే కష్టంగా ఉంది. వైరస్ వ్యాప్తికి కారణమైన లారీ డ్రైవర్‌ను సూపర్ స్ర్పెడర్‌గా గుర్తించి క్రిమనల్ కేసు నమోదు చేశారు. ఇక శనివారం వెల్లడించిన ఫలితాల్లో జీజీహెచ్‌లో పనిచేసే పీజీ వైద్యురాలికి కూడా వైరస్ సోకినట్లు గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com