ఓటీటీలో రిలీజ్ అవుతున్న మొదటి తెలుగు సినిమా..

లాక్‌డౌన్ కొత్త కొత్త ఆలోచనలకు తెరతీస్తోంది. అలా చేయక తప్పని పరిస్థితులు కూడా కొన్ని ఎదురవుతున్నాయి. మే 7 తరువాత అయినా జనం థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారో లేదో అనే ఓ సందిగ్ధం నుంచి బయటకు వచ్చి ఈ లోపే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై తమ చిత్రం అమృతరామమ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత సి.ఎన్. రెడ్డి తెలిపారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై వస్తున్న మొదటి తెలుగు చిత్రంగా రికార్డులకు ఎక్కనుంది ఈ చిత్రం. ఇప్పటి దాకా హీరోలే త్యాగం చేసిన సినిమాలే చూశాం. ఈ చిత్రంలో హీరోయిన్.. హీరోని అమితంగా ప్రేమిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచింది. ప్రేక్షకులు అర్థం చేసుకుని ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నారు చిత్ర నిర్మాత. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నారు. అన్నట్లు అమృతరామమ్ ఏప్రిల్ 29న జీ5లో విడుదలవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com