కరోనా కట్టడిపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష

కరోనా కట్టడిపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష

తెలంగాణలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకీ కేసుల సంఖ్య నమోదవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలపై సోమవారం సీఎం కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. అలాగే లాక్‌డౌన్‌ అమలుతో పాటు భవిష్యత్‌ కార్యాచరణపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ చర్చించినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story