28 April 2020 3:20 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / పాక్ ప్రధాని ఇమ్రాన్...

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స‌హాయ‌కుడికి క‌రోనా

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స‌హాయ‌కుడికి క‌రోనా
X

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఈ కరోనా వైరస్ పాకిస్తాన్ పై పంజా విసిరింది. పాక్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ప్ర‌ధాన స‌హాయ‌కుడికి క‌రోనా సోకింది. ఇమ్రాన్ ప్రధాన అనుచరుల్లో ఒకడైన సింధ్ ప్రావిన్స్ గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్ కు కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో పాక్ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయ్యింది. వెంట‌నే అత‌న్ని హాస్పిటల్‌కి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే ఇమ్రాన్ ఖాన్ కు కరోనా టెస్టులు నిర్వహించగా.. నెగెటివ్ గా తేలింది. కొన్ని రోజులు ఇమ్రాన్ కూడా స్వీయనిర్భందంలోకి వెళ్లాడు.

Next Story